హైదరాబాద్, జనవరి 5: స్టీల్ ట్యూబులు, పైపుల తయారీలో ప్రముఖ సంస్థ అయిన హైటెక్ పైప్స్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థి క సంవత్సరం మూడవ త్రైమాసికంలో అత్యధిక విక్రయాలు జరిపింది. క్యూ3లో 1,24, 233 ఎంటి విక్రయ పరిమాణాన్ని సాధించామని, 26.10 శాతం వార్షిక వృద్ధిని కనపర్చి నట్లు హైటెక్ పైప్స్ ఒక ప్రకటనలో తెలిపిం ది.
2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ెేడిసెంబర్ మధ్య తొమ్మిది నెలల్లో విక్రయ పరిమాణం 30.33 శాతం వృద్ధితో 3,69, 415 ఎంటికు పెరిగినట్లు పేర్కొంది. ఈ వృద్ధికి ముఖ్య కారణం సౌర టార్క్ ట్యూబులని, దేశం సౌర విద్యుత్ రంగం వేగం గా విస్తరిస్తుండటంతోతమ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువైందని కంపెనీ వివరించింది.
పునరుద్పాదక విద్యుత్ రంగంతో పాటు, మౌలిక వసతులు, నిర్మాణ రంగాలకు కూడా పైపుల సరఫరాలో గణనీయమైన వృద్ధి సాధించామని హైటెక్ పైప్స్ చైర్మన్ అజయ్ కుమార్ బన్సల్ తెలిపారు. హైటెక్ పైప్స్‌కు 20 రాష్టాల్లో 450కుపైగా డీలర్లతో దేశవ్యాప్తంగా విస్తృత మార్కెటింగ్ నెట్‌వర్క్ ఉన్నది.