11-04-2025 12:37:39 AM
- రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం
రాజేంద్రనగర్, ఏప్రిల్ 10: వాహనాలకు ఇకపై హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి అని రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం స్పష్టం చేశారు. టాక్సీ కట్టని, ఫిట్నెస్ లేని చెత్త సేకరణ ఆటోల సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. గురువారం ఆయన మణికొండ లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు బాధ్యులు కావాల్సిందే మని చెప్పారు. టాన్స్ పోర్టు వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలియజేశారు.దీర్ఘకాలంగా టాక్స్ కట్టకుండా, ఫిట్నెస్ లేకుండా రోడ్ల పై తిరుగుతున్నట్లు తమ పరిశీలనలో తేలినట్లు సదానందం పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. అదేవిధంగా గ్రేటర్, శివారు మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలలో తిరుగుతున్న చెత్త సే కరణ వాహనాల పై ప్రత్యేక దృష్టి సాధించామన్నారు. వాహనాలు రిజిస్ట్రేషన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు టాక్స్ చెల్లించనట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో చర్యలు తీసుకుంటు న్నామని పేర్కొన్నారు.
కనీసం ఫిట్నెస్ లేకుండా, ఇన్సూరెన్స్ కట్టకుండా ప్రతి రోజు వందల వాహనాలు రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నట్లు గుర్తించిన రవాణా శాఖ అధికారులు ఇక ఆయా వాహనాలకు బ్రేకులు వేయనున్నారు. వాటిని సీజ్ చేయడానికి రంగం కూడా సిద్దం చేస్తూన్నట్లు సమాచారం. వెంటనే టాక్స్ లు కట్టుకోవాలని, ఫిట్నెస్ చేయించుకోవాలని సూచించారు.
200 శాతం పెనాల్టీ విధించి వాహనాలు సీజ్ చేయనున్నట్లు ఉప రవాణా శాఖ అధికారి సదానందం పేర్కొన్నారు.15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాహన యజమా నులు గ్రీన్ టాక్స్ చెల్లించి, రీ రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి 5 సంవత్సరాలు పొడిగింపు చేసుకోవాలని ఆయన సూచించారు.