calender_icon.png 20 April, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హై ప్రొటీన్‌తో అనర్థమే..

06-04-2025 12:00:00 AM

ఆరోగ్యంగా ఉండటానికి ప్రొటీన్ అవసరమే కానీ అతిగా తీసుకోవడం వలన అనర్థమే. కణజాలాల తయారీ, మరమ్మతు, దృఢత్వం, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్ని రకాలుగా మేలు చేస్తుందనే ఉద్దేశంతో పాటు వెయిట్ లాస్‌కు కూడా సహకరిస్తుందనే ఆలోచనతో ప్రస్తుతం చాలా మంది ప్రొటీన్‌ను అతిగా తీసుకుం టున్నారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం సరికాదు. ప్రొటీన్‌ను ఎక్కువగా తీసుకుంటే చాలా సమస్యలొస్తాయని నిపుణులు చెబు తున్నారు. ప్రొటీన్ అతిగా తీసుకుంటే.. కార్బ్స్‌ను తగ్గించడంతో పాటు శరీరం పోషకాలు, ఫైబర్‌ను గ్రహించుకోలేదని, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు వెల్లడించారు.

హై ప్రొటీన్ డైట్ తీసుకుంటే దీర్ఘకాలంలో శరీరంపై దుష్ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముందుగా వయసు, లింగం, కార్యాచరణ వంటి విషయాలను పరిగణాలోకి తీసుకుని దాని ప్రకారం ప్రొటీన్ తీసుకోవాలి. శారీరక శ్రమ చేయని వారు రోజుకు ప్రతి కిలో బరువుకు కనీసం 0.8 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గంటకు పైగా తీవ్రమైన వ్యాయామం చేసేవారూ కిలో బరువుకు 1.2  1.7 గ్రాముల వరకూ ప్రొటీన్ తీసుకోవాలి.