calender_icon.png 17 November, 2024 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు

17-11-2024 12:00:00 AM

కేంద్ర అధికారి అజిత్‌కుమార్ సాహూ

గజ్వేల్, నవంబర్16: రైతులు ఆహార పంటలతో పాటు నూనె గింజల సాగు కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ నూనె గింజల విభాగం సం యుక్త కార్యదర్శి అజిత్‌కుమార్ సాహూ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు, వర్గల్ మండలాల్లో ఆయన ఆయిల్‌పామ్ నర్సరీ, రైతులు సాగు చేస్తున్న ఆయిల్‌పాం తోటలను పరిశీలించారు. అనంతరం రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మనుచౌదరితో కలిసి అజిత్‌కుమార్ మాట్లా డారు.

భవిష్యత్తులో ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు గడించవచ్చన్నారు. అనంతరం ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను పరిశీలించి ఒడిశా రాష్ట్ర ప్రతినిధులకు ఆయిల్‌పాం సాగు గురించి వివరించారు. రాష్ట్ర ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ సరోజినిదేవి, ఆయిల్‌ఫెడ్ మేనేజర్ సుధాకర్, జిల్లాఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి సువర్ణ, ఉద్యానశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.