calender_icon.png 23 December, 2024 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు..

13-09-2024 12:00:00 AM

వ్యాపారిని బురిడీ కొట్టించిన సైబర్ ముఠా

8.15 లక్షలకు టోకరా

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): షేర్లలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో లాభాలు పొందవచ్చంటూ ఓ వ్యాపారిని బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్లు. సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారికి ఇటీవల ఐఐఎఫ్‌సీ పేరుతో ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఐపీఓ/షేర్లలో పెట్టుబడులు పెడితే ఎక్కువ డబ్బు వస్తుందని ఉండడంతో ఆసక్తి చూపాడు. సైబర్ నేరగాళ్ల సూచనతో సభ్యత్వ రుసుం చెల్లించి తన వివరాలను అందించాడు. అనంతరం బాధితుడిని స్టాక్స్ కు సంబంధించిన ఓ వాట్సప్ గ్రూపు లో యాడ్ చేశారు.

మొదట్లో వ్యాపారి కొద్ది మొ త్తంలో పెట్టుబడి పెట్టి లాభాలు అర్జించాడు. తదనంతరం పలు దఫాలుగా మొత్తం రూ.8.15 లక్షలను పెట్టుబడులుగా పెట్టాడు. ఈ క్రమంలో వాటిని తిరిగి పొందడానికి చార్జీల పేరిట మరింత చెల్లించాలని నేరగాళ్లు సూచించారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు గురువారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ జరిగినట్లు గుర్తించిన బాధితులు గంటలోపు(గోల్డెన్‌అఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బును ఫ్రీజ్ చేసే అవకాశం ఉందని తెలిపారు.