calender_icon.png 26 December, 2024 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫాం ఆయిల్ తోటలతో రైతులకు అధిక లాభాలు

06-12-2024 03:05:45 PM

ఫాం ఆయిల్ తోటలు పెట్టిన ఖమ్మం జిల్లా రైతులు సంతోషంగా ఉంటున్నారు

ఖమ్మం జిల్లాలో ఫాం ఆయిల్ తోటల పరిశీలనలో ముత్తారం మాజీ జడ్పిటిసి, రైతు నాగినేని జగన్మోహనరావు 

ముత్తారం (విజయక్రాంతి): ఫాం ఆయిల్ తోటలతో రైతులకు అధిక లాభాలు అర్జిస్తున్నారని, ఫాం ఆయిల్ తోటలు పెట్టిన ఖమ్మం జిల్లా రైతులు సంతోషంగా ఉంటున్నారుని, ఖమ్మం జిల్లాలో ఫాం ఆయిల్ తోటల పరిశీలనలో ముత్తారం మాజీ జడ్పిటిసి, రైతు నాగినేని జగన్మోహనరావు అన్నారు. ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట లో ఆయిల్ ఫాం తోటలను ఆయన రైతులతో కలిసి పరిశీలించారు.

అక్కడి రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫాం ఆయిల్ ఫ్యాక్టరీ ని సందర్శించి ఫాం ఆయిల్ గెలలు నుంచి ఆయిల్ తీయి విధానం, అక్కడి అధికారులు విరికి  వివరించారు.  ఖమ్మం జిల్లాలో తిరుగుతూ అక్కడి రైతుల తో  కలిసి తోటలను పరిశీలించారు. ఖమ్మం రైతులు ఆయిల్ ఫాం తోటలతో రాబడి గురించి సంతోషంగా ఉన్నట్లు తెలిపారని, ఒక ఎకరానికి అన్ని ఖర్చులు పోను ఎకరానికి ఒక లక్ష నుండి లక్ష యాభైవేల వరకు నికర ఆదాయం వస్తుందని రైతులు తెలిపారని,  జగన్ మోహన్ రావు తెలిపారు. రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలోని రైతులందరూ కూడా ఫాం ఆయిల్ తోటలను అధిక సంఖ్యలో నాటి ఆర్థికంగా బలపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొల్లినేని బుచ్చంరావు, నాంసాని సమ్మయ్య, బుజేందర్ రైతులు పాల్గొన్నారు.