22-03-2025 10:25:45 PM
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..
మందమర్రి (విజయక్రాంతి): చెన్నూరు నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్య ఆరోగ్య రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పష్టంగా చేశారు. పట్టణంలోని నేతాజీ నగర్ లో 20 లక్షల వేగంతో చేపట్టనున్న పిహెచ్సి సబ్ సెంటర్ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. పట్టణంలో రెండు కోట్ల రూపాయల నిధులతో సైడ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని గతంలో సైడ్ డ్రైనేజ్ లేకపోవడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తు చేశారు. డ్రైనేజీ లేక దుర్వాసనతో, దోమలు విజృంభించి ప్రజలు రోగాల బారిన పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సైడ్ డ్రైనేజ్ నిర్మించాకే సీసీ రోడ్లు వేస్తున్నామని, నియోజకవర్గంలో అవసరం ఉన్నచోట సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో స్మశాన వాటిక నిర్మించడంతో పాటు చెన్నూరు నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 30 కోట్లతో త్రాగు నీరు అందించేందుకు అమృత్ స్కీమ్ పథకాన్ని ప్రారంభించామని మరో ఆరు నెలల్లో ఇంటింటికి త్రాగునీరు అందిస్తామన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ సామర్థ్యం 800 మెగావాట్స్ పెంచాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరానని త్వరలో సీఎంతో కలిసి పనులు ప్రారంభిస్తామని ఆన్నారు. సింగరేణిలో కొత్త గనుల అంశంపై సీఎం, సింగరేణి అధికారులతో చర్చించి కొత్త గనులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.