అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి
కరీంనగర్, అక్టోబరు 20 (విజయక్రాంతి): తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే రాష్ట్రంలో క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వ్యాయామ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో పీఈటీల నుంచి పీడీలుగా పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులను ఆయన ఘనంగా సన్మానించారు.
పట్టభద్రుల ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఉత్తర తెలంగాణ కేంద్రంగా అతిపెద్ద స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీలు నిర్మించి క్రీడా మైదానాలు అన్యక్రాంతం కాకుండా కాపాడుతానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చట్టసభల్లో పోరాడతానని అన్నారు.