calender_icon.png 5 December, 2024 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ కమిషన్‌తో ఉన్నతాధికారుల భేటీ

15-09-2024 01:08:23 AM

కులగణన, క్షేత్రస్థాయి పరిశీలన షెడ్యూల్‌పై చర్చ

హైదరాబాద్, సెప్టెంబర్ 14(విజయక్రాంతి): తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్‌తో పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీ డీఎస్ లోకేశ్ కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్, డిప్యూటీ కమిషనర్ సుధాకర్ శనివారం కమిషనర్ కార్యాలయంలో సమా వేశమయ్యారు. బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మి, సభ్య కార్యదర్శి బాల మాయదేవిలతో  కులగణన విధివిధా నాలపై చర్చించారు. త్వరలో కులగణన కార్యాచరణను ప్రకటించాలని నిర్ణ యించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు జిల్లాల వారీగా పర్యటించే షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమావేశంలో పేర్కొన్నారు.