calender_icon.png 4 March, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టపగలే హైమాస్ట్ వెలుగులు

03-03-2025 04:11:39 PM

అన్న సాగర్ గ్రామంలో నిర్లక్ష్యంగా గ్రామ పంచాయతీ సిబ్బంది

భూత్పూర్,(విజయక్రాంతి):  అసలే వేసవికాలం వచ్చేసింది. ఆపై విద్యుత్తు వినియోగం కూడా అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును కూడా అందిస్తున్న విషయం విధితమే. భూత్పూర్ మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో హైమాస్ట్ విద్యుత్ దీపాలు రాత్రిపూట వేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. పట్టపగలే ఈ విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. విద్యుత్ను ఆదా చేయాల్సిన అధికార యంత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా పగటి పూట కూడా హై మస్ట్ విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరంతరం విద్యుత్ దీపాలు వెలగకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు కోరుతున్నారు.