calender_icon.png 16 April, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై సూచనలకు ఉన్నత స్థాయి కమిటీ

16-04-2025 12:24:57 AM

గవర్నర్‌తో విభేదాల వేళ.. స్టాలిన్ ప్రభుత్వం దూకుడు

చెన్నై, ఏప్రిల్ 15: రాష్ట్ర హక్కులు, స్వ యంప్రతిపత్తికి సంబంధించిన అంశాలను పరిశీలించి, సూచనలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని తమిళనా డు సీఎం ఎంకే స్టాలిన్ అంసెబ్లీ వేదికగా మంగళవారం ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్టాలిన్ ప్రసంగిస్తూ ‘రా ష్టం హక్కులను పరిరక్షించేందుకు, కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను మె రుగుపర్చేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశాం.

ఈ కమిటీ సమగ్ర అధ్యయ నం జరిపి, ప్రభుత్వానికి సూచనలు ఇస్తుం ది’ అని పేర్కొన్నారు. దీంతోపాటు 2026 జనవరి నాటికి ఈ కమిటీ తన మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందని తెలిపారు. అలాగే, రెండేళ్లలో కమిటీ తన పూర్తిస్థాయి నివేదికను అందిస్తుందని చెప్పా రు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పాలన, విధానాల రూపకల్పన అంశాలను తిరిగి పొందేందుకు చర్యలను సిఫార్సు చేసే బాధ్యత కూడా కమిటీకి ఉంటుందని వెల్లడించారు.

ఈ క్రమంలోనే రాష్ట్రాల హక్కుల ను కేంద్ర ప్రభుత్వం లాగేసుకుంటుందని స్టాలిన్ మండిపడ్డారు. కాగా, కమిటీ సారథ్య బాధ్యతలను సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్‌కు అప్ప గించిన తమిళనాడు ప్రభుత్వం.. మాజీ ఉన్నతాధికారులు అశోక్ శెట్టి, ఎంయూ నాగరాజన్‌ను సభ్యులుగా నియమించింది.  కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చేసిన తీర్మానానికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది.

ఇదిలా ఉంటే, తమిళనాడు గవర్నర్ పెండింగ్‌లో పె ట్టిన 10 బిల్లలకు ఇటీవలే సుప్రీం కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న బిల్లులకు గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చే యడంతో తమిళనాడు ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ పరిణా మాల వేళ స్టా లిన్ సర్కార్ నుంచి కమిటీ ఏర్పాటు నిర్ణ యం వెలువడటం గమనార్హం.