calender_icon.png 31 January, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోత్కూరు వాగుపై హైలెవల్ బ్రిడ్జి

30-01-2025 12:00:00 AM

మంజూరు చేసిన మంత్రి కోమటిరెడ్డి

యాదాద్రి భువనగిరి, జనవరి 29 (విజయ క్రాంతి) ః మోత్కూరు గుండాల మధ్యలో ఉన్నటువంటి బిక్కేరు బిడ్జీ పై హై లెవెల్ బ్రిడ్జిని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంజూరు చేశారు. హస్తమును బ్రిడ్జి సింగిల్ గా ఉండడం వల్ల ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ విషయాన్ని  రోడ్డు భవా ణాల శాఖ మంత్రి కోమటి రెడ్డి  ధృషి తీసు కేళ్ళడంతో హై లెవల్ బిడ్జి మంజూరు చేసినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ  ఉపాధ్యక్షు లు పైళ్ల సోమిరెడ్డి తెలిపారు.

బుధవారం నాడు మోత్కూరులో మాజీ ఎంపీపీ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ తో కలిసి  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 35ఏళ్లుగా పార్టీ క్రమశిక్షణ సైనికునిగా పని చేశానని, మాజీ మంత్రి (దివంగత ) ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి నాయ త్వంలో 18 ఏళ్లుగా మచ్చలేని నాయకుని గా ఎదిగానని చెప్పారు.

తన పనితీరుపై  పార్టీ  అధిష్ఠానం గుర్తించి డి.సి.సి.ఉపాధ్య కులు గా నియమించారని తెలిపారు.ఈ సమావేశంలో మాట్లాడుతున్న క్రమంలో మోత్కూరు మున్సిపల్ అభివృద్ధికి 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి  కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్  ద్వారా తెలిపినట్లు సోమిరెడ్డి తెలిపారు.

తన  డి.సి. సి ఉపాధ్యక్లులుగా  పదవి నియమాకానికి సహకరించిన మంత్రి వెంకట్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు అండెం సంజీవ రెడ్డి గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాజీ ఎంపీపీ మండల కాంగ్రె స్ పార్టీ అధ్యక్షుడు వంగాల సత్యనారా యణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో వర్గ విభేదాలు కాకుండా ఐక్యమతంగా కలసి పని చేద్దామని అన్నారు.

ఈ సమావేశంలో  వ్యవసాయ మార్కెట్ కమిటి డైరెక్టర్  మహ్మ ద్ సమీర్, టిపిసిసి రాష్ర్ట నాయకులు పర్రేపాటి యుగంధర్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, సుధ గాని పాండు, తండు సత్తయ్య,  అంతటి నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ అనుబంధ నాయ కులు బీసు శ్రీకాంత్, ఆకుల వెంకన్న, పల్లె భిక్షం, కూరేళ్ళ శ్రీ రాములు, నోముల రమేష్ నేత, పురుగుల నర్సింహ్మ్మ, అమీర్ ఉప్పలయ్య, మహ్మద్ ఆలీ వీరాస్వామి, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.