డిపాజిట్ల సేకరణలో వివిధ బ్యాంక్‌ల మధ్య నెలకొన్న పోటీ కారణంగా కొద్ది వారాల నుంచి కొన్ని బ్యాంక్‌లు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అధిక వడ్డీ రేటు లభించే బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేయాలని సాధారణంగా మదుపుదారులు ఆశిస్తుంటారు. అలాగే ఎఫ్‌డీ కాలపరిమితి తక్కువ ఉంటే తక్కువ వడ్డీ రేటు, దీర్ఘకాలిక ఎఫ్‌డీ అయితే అధిక వడ్డీ రేటు లభిస్తుందన్న సంగతి తెలిసిందే.
పలు పెద్ద బ్యాంక్‌లు ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను సవరించాయి. సాధారణంగా బ్యాంక్‌తో కస్టమర్లకు దీర్ఘకాలిక అనుబంధం ఉంటుంది. ఇదే సమయంలో కాస్త ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్‌ను సైతం ఎంచుకోవడం సహజం.
అందుచేత ఖాతాదారులు తన బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే బ్యాంక్‌లో కాకుండా మరో బ్యాంక్‌లో ఎఫ్‌డీ చేయాలని చూస్తుంటారు. అంటే మూడేండ్ల ఫిక్స్‌డ్‌కు ఎక్కువ వడ్డీ, ఒక ఏడాది ఎఫ్‌డీకి తక్కువ వడ్డీ లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ఏడాది ఎఫ్‌డీపై ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న పెద్ద బ్యాంక్‌ల వివరాలు...
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక సంవత్సరం కాలపరిమితిగల డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం చొప్పున వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నది. ఈ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి.
కెనరా బ్యాంక్
కెనరా బ్యాంక్ ఒక సంవత్సరం కాలపరిమితిగల డిపాజి ట్‌పై సాధారణ పౌరులకు 6.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం చొప్పున వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నది. ఈ రేట్లు జూన్ 11 నుంచి అమలులో ఉన్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఈ బ్యాంక్ ఒక ఏడాది కాలపరిమితిగల డిపాజిట్‌పై 6.8 శాతం వడ్డీని ఇస్తుండగా, సీనియర్ సిటిజన్లను 7.30 శాతం ఆఫర్ చేస్తున్నది. జూన్ 15 నుంచి ఇవే రేట్లు అమలవుతున్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ పౌరులకు 6.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం చొప్పున ఏడాది ఎఫ్‌డీపై వడ్డీ ఇస్తున్నది.
ప్రైవేటు బ్యాంక్‌లు
కోటక్ మహీంద్రా బ్యాంక్
కోటక్ మహీంద్రా బ్యాంక్ వడ్డీ రేట్లు ఒక ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం చొప్పున ఉన్నాయి. ఈ రేట్లు జూన్ 14 నుంచి అమలులో ఉన్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
ప్రైవేటు రంగంలోని అతిపెద్దదైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ డిపాజిటర్లకు 6.60 శాతం, సీనియర్లకు 7.10 శాతం వడ్డీని ఇస్తున్నది. జూలై 24 నుంచి ఈ రేట్లు అమలులో ఉన్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ఏడాది - 15 నెలల కాలపరిమితిగల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై జనరల్ సిటిజన్లకు 6.7 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం చొప్పున వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నది.
ఫెడరల్ బ్యాంక్
ఫెడరల్ బ్యాంక్ ఒక ఏడాది కాలపరిమితిగల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.8 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.3 శాతం చొప్పున వడ్డీ రేటు ఇస్తున్నది. అక్టోబర్ 16 నుంచి ఈ రేట్లు అమలులోకి వచ్చాయి.