calender_icon.png 22 September, 2024 | 8:04 PM

ఆయిల్ ఫామ్ సాగుతో అధిక ఆదాయం

22-09-2024 05:45:07 PM

ఫీల్డ్ ఆఫీసర్ అశోక్

నాగారం,(విజయక్రాంతి): నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని పతంజలి తుంగతుర్తి డివిజన్ ఫీల్డ్ ఆఫీసర్ పి అశోక్ అన్నారు. మండల కేంద్రంలోని కడారు నర్సింహా రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నూతనంగా ఆయిల్ ఫామ్ మొక్కలను నాటే కార్యక్రమం ను మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్బంగా పి.అశోక్ మాట్లాడుతూ... జిల్లాలో తుంగతుర్తి డివిజన్లో ఆయిల్ పామ్ తోటలు సాగు అవుతున్నాయని చెప్పారు.

ఈ ప్రాంతంలోని రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అందించే రాయుతిలను సద్వినియోగం చేసుకొని ఆయిల్ ఫామ్ తోటలను సాగుచేసి అధిక ఆదాయం పొందాలని కోరారు. ఈ పంటకు కూలీ ఖర్చులు తక్కువ, కోతుల, బెడదలేద అన్నారు. ఆయిల్ ఫామ్ పంటను ప్రభుత్వం నిర్ణయుంచిన ధరకు ప్రభుత్వం నియమించిన కంపెనీ వారే విక్రయస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో పతంజలి క్షేత్ర సహాయకులు రంగు ముత్యంరాజు  రైతులు  నరేష్ రెడ్డి, కడారు సరళ రమేష్, గణేష్ తోపాటు పలువురు రైతులు పాలుగోన్నారు.