calender_icon.png 1 November, 2024 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్ బెయిల్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

30-07-2024 12:05:00 AM

న్యూఢిల్లీ, జూలై 29 : ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ అరెస్ట్ చేసిన కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్ నీతా బన్సల్ కృష్ణ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై మొదట ట్రయల్ కోర్టులో విచారణ జరగాలని, కేజ్రీవాల్ సహా ఆరుగురిపై ఇప్పటికే చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు హైకోర్టుకు తెలిపింది. కేసు దర్యాప్తును కేజ్రీవాల్ ప్రభావితం చేస్తున్నారని, ఆయన అరెస్టు తర్వాత అనేక ఆధారాలు వెలుగులోకి వచ్చాయని, సమగ్ర దర్యాప్తు జరిపి చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు న్యాయస్థానానికి తెలిపింది.  ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.