హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఫైనల్ కీ, మల్టిఫుల్ ఇష్యూస్ కేసులో గతంలో సింగిల్ బెంచ్ రిజర్వ్ చేసిన తీర్పు మంగళవారం వెలువడనుంది. అదే విధంగా డివిజన్ బెంచ్‌లో జీవో 29మీద దాఖలైన అన్ని పిటిషన్లు కూడా విచారణకు రానున్నాయి. ఈ నేపథ్యంలో తీర్పుపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. రాబోయే తీర్పు మీద ఈనెల 21న జరగబోయే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల భవితవ్యం ఆధారపడి ఉంది. గందరగోళ పరిస్థితుల్లో మెయిన్స్ పరీక్షలను రీ షెడ్యూల్ చేసి కోర్టు కేసులన్నీ ఓ కొలిక్కి వచ్చాకే పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు.