calender_icon.png 8 April, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేలుళ్ల కేసు హైకోర్టు తీర్పు నేడు

08-04-2025 01:58:46 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): దేశంలో సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేలుళ్ల కేసులో మంగళవారం తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. 2013లో దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ఎదుట జరిగిన బాంబుపేలుళ్లపై నమోదైన ఈ కేసులో ప్రధాన నిందితుడైన యాసిన్ బత్కల్ సహా ఐదుగురికి ఎన్‌ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2016, డిసెంబర్ 13న తన తుది తీర్పులో ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. కాగా 2013, ఫిబ్రవరి 21న జరిగిన ఈ బాంబు పేలుళ్లలో 18 మంది మృతిచెందగా.. 130 మందికి పైగా గాయపడ్డారు.