18-04-2025 01:10:59 AM
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ విభాగానికి సంబంధించిన 308 ఆయుష్ ఫార్మసిస్టు పోస్టుల భర్తీకి విద్యార్హతను డీ ఫార్మసీ, బీ ఫార్మసీ (అల్లోపతి డాక్టర్ ఇన్ ఫార్మసీ)గా సర్వీస్ రూల్స్ మారుస్తూ గతనెల 28న జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ జీవో వల్ల 20 ఏళ్లుగా పనిచేస్తున్న 275 మంది ఆయుష్ ఎన్‌ఆర్‌హెఎం కాంట్రాక్టు ఫార్మసిస్టులు భవిష్యత్తులో ఆయుష్ ఫార్మసిస్ట్ పోస్టులకు అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రస్తుతం పనిచేస్తున్నవారిలో 62 మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం జూన్ 30 వరకు కాంట్రాక్ట్ ఆయుష్ ఫార్మసిస్ట్ ఉద్యోగులుగా చేస్తున్న వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టొందని.. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్టు ఆయుష్ కాంపౌండర్స్, ఫార్మసిస్ట్ ఎన్‌ఆర్ హెఎం రాష్ర్ట సంఘం తెలిపింది.