నాగర్ కర్నూల్, విజయక్రాంతి: రైతులు పండించిన వరి ధాన్యాన్ని సరఫరా చేసేందుకు సివిల్ సప్లై శాఖ నిర్వహించిన టెండర్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని బాధితులు హైకోర్టును ఆశ్రయించగా శనివారం టెండర్ ఫలితాలను నిలుపుదల చేయాలని హైకోర్టు స్టే విధించింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి అచ్చంపేట కోల్లాపూర్ నాగర్ కర్నూల్ డివిజన్ పరిధిలోని రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఆయా గోడౌన్, రైస్ మిల్లులకు దాన్యం, గన్ని బ్యాగులను సరఫరా చేసేందుకు గాను సివిల్ సప్లై శాఖ గత నెల టెండర్లను పిలిచింది.
కానీ పొలిటికల్ లీడర్స్ తమ పరపతిని ఉపయోగించి తమ వర్గానికి చెందిన వ్యక్తులకు మాత్రమే టెండర్ దొరికేలా పావులు కలిపారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా సుమారు 20కి పైగా దాఖలైన టెండర్లు ఈ నెల 12న ఆఫ్ లైన్ ద్వారా నేరుగా కార్యాలయంలో టెండర్లను వేసేందుకు వెళ్లిన టెండర్ దారులను కొంతమంది పొలిటికల్ లీడర్లు బలవంతంగా వారిపై దౌర్జన్యం చేస్తూ టెండర్లు దాతలు కాకుండా ఇబ్బందులకు గురి చేశారు. ఇదంతా పోలీస్ అధికారుల కల్ల ముందే జరిగినా పట్టించుకోలేదని బాధితులు హైకోర్టులను ఆశ్రయించారు. దీంతో కోర్టు టెండర్ ఫలితాలను నిలుపుదల చేయాలంటూ స్టే విధిస్తూ ఆయా శాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.