calender_icon.png 23 September, 2024 | 6:21 PM

హైడ్రా పంజా.. దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే

23-09-2024 04:25:18 PM

హైదరాబాద్: దుర్గం చెరువు సరస్సు చుట్టూ హైడ్రా కూల్చివేతలను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమర్ సొసైటీ నివాసితులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. దుర్గం చెరువు ఎఫ్ టీఎల్ నిర్ధరణ శాస్త్రీయంగా జరగలేదంటూ కోర్టులో పిటిషన్లు దాఖాలయ్యాయి. ఎఫ్ టీఎల్ నిర్ధరణపై దాఖలైన పిటిషన్లను సీజే ధర్మాసనం విచారించింది. ఎఫ్ టీఎల్ పై అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. చెరువుల పరిరక్షణ కమిటీకి బాధితులు అభ్యంతరాలు తెలపాలని కోర్టు సూచించింది.

వారంలోపు బాధిుతులు అభ్యంతరాలు తెలపాలని ఆదేశించింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని 6 వారాల్లో ఎఫ్ టీఎల్ నిర్ధారించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 6 వారాల్లోపు కూల్చివేతలు చేపట్టబోమని జీహెచ్ఎంసీ కోర్టుకు తెలిపింది. రికార్డుల ప్రకారం దుర్గంచెరువు ఎఫ్ టీఎల్ 65 ఎకరాలే ఉందని పిటిషన్లు పేర్కొన్నారు. దుర్గం చెరువు ఎఫ్ టీఎల్ 160 ఎకరాలు ఉందని అధికారులు చెప్పడం సరికాదని పిటిషనర్లు వాపోయారు. ఇప్పటివకే హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్స్ (FTL), సరస్సుల బఫర్ జోన్‌లలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా  బృందం పరిశీలిస్తోంది.