న్యూఢిల్లీ, జనవరి 13: కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చించకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆమ్ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఢిల్లీ లిక్కర్ పాలసీపై కాగ్ నివేదిక తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ విషయంపై సోమవారం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆదేశించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యేలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వీలైనంత తొందరగా అసెంబ్లీలో చర్చించాలని పేర్కొంది.