సూర్య కథానాయకుడిగా రూపొందిన ‘కంగువ’, ‘ఇండియన్ 2’ వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీనికి కేవలం నెగిటివ్ రివ్యూలే కారణమని తమిళ సినీ నిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు కొద్ది రోజుల క్రితం థియేటర్ల యాజమాన్యాలను.. యూట్యూబ్ ఛానళ్ల వాళ్లు ఫ్యాన్స్ ఇంట ర్వ్యూలు చేయకుండా చూడాలని కోరారు. తాజాగా తమిళ ఫిలిం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (టీఎఫ్‌ఏపీఏ).. సినిమా విడుదలైన మూడు రోజుల వరకూ రివ్యూలు ఇవ్వకుం డా నిషేధం విధించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసింది.
టీఎఫ్‌ఏపీఏ ఈ పిటిషన్‌ను ఫైల్ చేసింది. సోషల్ మీడియా వేదికల్లో సైతం ఆన్‌లైన్ రివ్యూస్ ఇవ్వకుండా చూడాలని కోరింది. అయితే తమిళ నిర్మాతలకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. మంగళవారం రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎస్ సౌంతర్ ధర్మాసనం.. రివ్యూలపై నిషేధం విధించడం కుదరదని తేల్చింది. సినిమా సమీక్షలు సహా విమర్శలు భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తాయని.. అది రాజ్యాంగ కల్పించిన హక్కు కాబట్టి నిషేధం విధించలేమని కోర్టు స్పష్టం చేసింది.