calender_icon.png 3 October, 2024 | 4:49 PM

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాకిచ్చిన హైకోర్టు

03-10-2024 12:13:13 PM

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్ట్‌ డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితం సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేశారు. అనర్హత పిటిషన్ పై పత్రాల పరిశీలన, విచారణ తేదీలు నిర్ణయించాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది. తేదీలు నిర్ణయించి స్వీకర్ టేబుల్ పై పెట్టాలని అసెంబ్లీ కార్యదర్శిని హైకోర్టు తెలిపింది. నెల రోజుల్లోగా తేదీలు నిర్ణయించి హైకోర్టు రిజిస్ట్రార్ కు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చూస్తూ అసెంబ్లీ కార్యదర్శి అప్పీలు దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించాలని అసెంబ్లీ కార్యదర్శి అప్పీలులో కోరారు. కానీ, స్టే ఇవ్వాడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 24న వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. దానం నాగేందర్, కడియం, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని గతంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించిన ముచ్చట తెలిసిందే.