హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సీజే ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. సెప్టెంబరు 9, 2024న సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాంగ్రెస్‌లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్‌రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సీజే ధర్మాసనం సూచించింది. 10 షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని స్వీకర్ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఐదేళ్ల అసెంబ్లీ గడువు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది.