calender_icon.png 24 December, 2024 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం.. దోషికి ఉరిశిక్ష

31-07-2024 07:53:51 PM

హైదరాబాద్: నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి ఉరిశిక్ష పడింది. 2018లో సెంట్రింగ్ కార్మికుడు దినేష్ కుమార్ అనే వ్యక్తి నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించి విచారణ చేపట్టిన రంగారెడ్డి కోర్టు 2021లోనే దినేష్ కు ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును అతడు హైకోర్టులో సవాల్ చేశాడు. రంగారెడ్డి కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థిస్తూ దోషికి ఉరిశిక్ష విధించింది.