calender_icon.png 21 April, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గ్రూప్-1’పై స్టేకు హైకోర్టు నిరాకరణ

18-04-2025 01:03:15 AM

  1. ధ్రువ పత్రాల పరిశీలన మాత్రం యథావిధిగా
  2. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని టీజీపీఎస్సీకి ఆదేశాలు

హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన మాత్రం య థావిధిగా కొనసాగించొచ్చని స్పష్టం చేసిం ది. విచారణ పూర్తయ్యే వరకు మాత్రం ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొ ద్దని టీజీపీఎస్సీని ఆదేశించింది.

ఇటీవలే వెల్లడించిన గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్‌ను సవాల్ చేస్తూ 20 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, మూల్యాంకనం సరిగా నిర్వహించలేదని, అందుకే అభ్యర్థులు నష్టపోయారని పిటిషనర్లు పేర్కొన్నారు.

మూల్యాంకనం, నియామకాలు నిబంధనలకు విరుద్ధమని.. మూల్యంకనం మరోసారి చే యాలని లేదంటే మెయిన్స్ మరోసారి నిర్వహించాలని కోర్టుకు విన్నవించారు. తెలం గాణ ప్రభుత్వం, టీజీపీఎస్సీని ప్రతివాదులు గా చేర్చారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గ్రూప్-1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.  తదు పరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.