05-03-2025 01:36:54 AM
స్పీకర్ పరిధిలోని అంశం
కోర్టుల జోక్యం ఎలా ఉంటుంది?
పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): ప్రతిపక్ష నేత అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అంశం స్పీకర్ పరిధిలో ఉంటుందని, దీనిలో కోర్టులు జోక్యం చేసుకోవని హైకో ర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై న్యాయసమీక్షకు ఉన్న అవకాశాలపై వివరణ ఇవ్వా లని పిటిషనర్ కోరగా విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. ప్రతిపక్ష నేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యేలా స్పీకర్‌తో పాటు స్పీకర్ కార్యాల యానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.విజయ్‌పాల్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు.
పిల్‌పై మంగళవారం తాత్కాలిక సీజే జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవా ది శ్రీనివాసరెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. ‘2023లో ప్రతిపక్ష నేత అయినప్పటి నుంచి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు. ఆయన అసెంబ్లీకి వచ్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తాల్సి ఉన్నది. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సి ఉన్నది.
ఒకవేళ కేసీఆర్ అనారోగ్యకారణాల తో అసెంబ్లీకి హాజరు కాలేకపోతే, ప్రతిపక్ష నేత బాధ్యతలను మరొకరికి అప్పగించేలా న్యాయస్థానం చర్యలు తీసుకోవాలి’ అని కోర్టును కోరారు. దీనిపై ధర్మాసనం స్పంది స్తూ.. ఈ అంశం అసెంబ్లీ స్పీకర్ పరిధిలోని అంశమని, ఆ విషయంలో న్యాయస్థానం ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించిం ది. దీనిపై ఏ ప్రాతిపదికన న్యాయసమీక్ష చేయగలమని ధర్మాసనం ప్రశ్నించగా.. కాస్త గడువు ఇస్తే వివరాలు ఇవ్వగలమని పిటిషనర్ తెలిపారు. దీంతో ధర్మాసనం విచారణ ను వాయిదా వేసింది.