calender_icon.png 9 January, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి

08-01-2025 03:14:09 PM

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) విచారణ చేపట్టింది. ఏసీబీ విచారణలో కేటీఆర్‌తో కలిసి లాయర్ కూర్చోవడానికి వీల్లేదన్న హైకోర్టు తెలిపింది. ముగ్గురు లాయర్ల పేర్లు ఇవ్వాలని సూచించింది. ఏసీబీ ఆఫీస్‌లో నిందితుడికి దూరంగా లాయర్లు ఉండేందుకు అనుమతిస్తామన్న హైకోర్టు కేటీఆర్(KTR) వెంట న్యాయవాదిని తీసుకెళ్తేందుకు అనుమతిస్తామని తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు 4 గంటలకు వాయిదా వేసింది.

కేటీఆర్ తో న్యాయవాదిని అనుమతించాలని కేటీఆర్ న్యాయవాది ప్రభాకర్ రావు(KTR's lawyer Prabhakar Rao) హైకోర్టును కోరారు. గతంలోనూ లాయర్ అనుమతికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు. అవినాష్ రెడ్డి విచారణ సందర్భంగా ఇదే హైకోర్టు అనుమతించిదని న్యాయవాది గుర్తుచేశారు. ఏసీబీ తరుపున అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. న్యాయవాదిని అనుమతించొద్దంటూ ఆయన వాదించారు. న్యాయవాదిని అనుమతిస్తే సమస్యంటని న్యాయమూర్తి ఏఏజీని ప్రశ్నించారు.