calender_icon.png 11 January, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జస్టిస్ పర్వతరావుకు హైకోర్టు నివాళి

31-12-2024 02:55:04 AM

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): ఇటీవల మృతిచెందిన ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ పర్వతరావుకు తెలంగాణ హైకోర్టు నివాళి అర్పించిం ది. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే అధ్యక్షతన హైకోర్టు మొదటి కోర్టు హాల్లో న్యాయమూర్తులంతా సోమవారం ప్రత్యేకంగా సమావే శమై, సంతాపం తెలియజేశారు.

జస్టిస్ పర్వతరావు అందించిన సేవలను కొనియాడా రు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ప్రసం గిస్తూ.. ఎంసెట్ రాసిన విద్యార్థులకు తమ జవాబు పత్రాన్ని తిరిగి మూల్యాంకనం చేసే హక్కు ఉంటుందనే తీర్పును జస్టిస్ పర్వతరావు చెప్పారని గుర్తు చేశారు. పదవీ విర మణ తర్వాత కూడా సేవా కార్యక్రమాలను నిర్వహించారని గుర్తుచేశారు.

గౌతమి సేవాసమితికి 27 ఎకరాల భూమిని ఇచ్చారని, గ్రామీణ విద్యను ప్రోత్సహించారని, ప్రజ్ఞా భారతి, భారతీయ పరిషత్ వంటి సంస్థలతో కలిసి పనిచేశారని కొనియాడారు. సేంద్రియ వ్యవసాయంపై పలు జిల్లాల్లో రైతులకు అవగాహన కల్పనకు పాటుపడ్డారన్నారు. గోశా లను స్థాపించారన్నారు.

తొలుత అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. జస్టిస్ పర్వతరావు 1961లో న్యాయవాదిగా ఎన్రో ల్ అయ్యారని, నాటి అడ్వకేట్ జనరల్ డీ నరసరాజు చాంబర్‌లో జూనియర్‌గా చేరారని, 1990 మార్చి 16న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 1997 నవంబర్ 26న పదవీ విరమణ చేశారని గుర్తుచే శారు.

సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పీ వెంకట్రామిరెడ్డ్డి, హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ సీ కోదండరాం, అదనపు సొలిసిటర్ జనరల్ నర్సింహశర్మ, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ చైర్మన్ ఏ రవీందర్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీ నాగేశ్వర్‌రావు, రిటై ర్డు న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు జస్టిస్ జీ యతిరాజు, న్యాయవాధికారులు, , జస్టిస్ పర్వతరావు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు హాజరయ్యారు.