హైదరాబాద్,(విజయక్రాంతి): గేటెడ్ కమ్యూనిటీల విషయంలో తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కీలక తీర్పునిచ్చింది. గేటెడ్ కమ్యూనిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ(Gated Community Executive Committee)లకు నిబంధనలు పాటించేలా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు మంగళవారం సైబారాబాద్ సీపీ(Cyberabad CP)కి ఆదేశాలు జారీ చేసింది. గేటెడ్ కమ్యూనిటీ క్లబ్ హౌస్(Gated community clubhouse)లో అసాంఘిక పనులు కొనసాగుతున్నాయని కేపీహెచ్ బీలోని ఇందు ఫార్చూన్ ఫీల్డ్ విల్లాస్(Indu Fortune Fields Villas) నివాసి పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ఇందు ఫార్చూన్ ఫీల్డ్ విల్లాస్ లో ముగ్గురితో ప్రత్యేక కమిటీ వేయాలని తీర్పు వెలువరించింది. క్లబ్ హౌస్ కార్యకలాపాలను ప్రతిరోజు పరిశీలించాలని, క్లబ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కమిటీని ఆదేశించింది. విల్లాల్లో ఉండేవారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు పాటించేలా నోటీసులు ఇవ్వాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.