calender_icon.png 19 April, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమిళనాడు మంత్రిపై కేసు

17-04-2025 11:17:17 PM

ఏప్రిల్ 23లోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న హైకోర్టు

చెన్నై: తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి మీద ఈ నెల 23లోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని తమిళనాడు హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పొన్ముడి హిందూ నామాల గురించి అశ్లీలంగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను తమిళనాడు పోలీసులు పాటించకపోతే పొన్ముడి మీద సుమోటోగా కేసు నమోదు చేస్తామని కూడా హెచ్చరించింది. మంత్రి వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా ఖండించారు.