హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని తాను అడ్డు కున్నానంటూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటు ప్పల్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసు కొట్టివేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపా ల్‌డ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. ప్రతివాదులైన పోలీసులకు నోటీసులు జారీ చేశారు.
2021లో చౌటుప్పల్ మండలం లక్కవరంలోని ఓ కల్యాణ మండపంలో జరుగుతున్న ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని, అక్కడ ఉన్న మంత్రి చేతి నుంచి మైక్ లాక్కున్నారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేసి 2022లో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై మోపిన అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. రాజకీయ కక్షతో ఎమ్మెల్యేపై తప్పుడు కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. విచారణలో ఉన్న ఆ కేసును కొట్టివేయాలని కోరారు. అనంతరం న్యాయమూర్తి స్పం దించి ప్రతివాదులైన చౌటుప్పల్ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.