calender_icon.png 28 December, 2024 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీసీఐ, హెచ్‌సీఏకు హైకోర్టు నోటీసులు

08-11-2024 01:03:23 AM

హైదరాబాద్, నవంబర్ 7  (విజయక్రాంతి): భార త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), హైదరాబాద్ క్రికె ట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత 12 ఏళ్లుగా హెచ్‌సీఏలో జరగుతున్న అవకతవకలపై నిర్ణీత గడువులోగా సీబీ ఐ విచారణ జరిపించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది.

హెచ్‌సీఏ ఆధ్వ ర్యంలోని వివిధ క్రికెట్ క్లబ్బుల్లో పే-అండ్-ప్లే సంస్కృతి కారణంగా ప్రతిభావంతులైన యువకులు అవకాశాలను కోల్పోతున్నారని హైకోర్టును టీసీఏ ఆశ్రయిం చింది. సొసైటీ చట్టం ప్రకారం క్లబ్స్ వ్యక్తిగత ఆస్తిగా ఉండకూడదని, అయితే ఇప్పటికీ కొంతమంది సభ్యు లు 30 నుంచి 40 ఏళ్లుగా ఈ ఆస్తులకు యజమానులుగా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ వాదించారు.

లోథా కమిటీ సిఫార్సులు, బీసీసీఐ, హెచ్‌సీఏ  చట్టా ల ప్రకారం, ఒక సభ్యుడు క్రికెట్ క్లబ్‌లో 9 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కొనసాగకూడదని చెప్పా రు. అయితే ఆ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదన్నారు. అవకతవకలకు పాల్పడిన వ్యక్తులపై చర్య లు తీసుకోవడంలో హెచ్‌సీఏ విఫలమైనందున సీబీ ఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును టీసీఏ కోరింది. తదుపరి విచారణ 28కివాయిదా పడింది.