calender_icon.png 24 October, 2024 | 2:52 AM

పీడీ నియామకంపై హైకోర్టు నోటీసులు

11-07-2024 12:46:13 AM

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): తెలంగాణ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా జీ వైజయంతి నియామకంపై బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ స్థానంలో కొత్తగా వచ్చిన బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 25 ఏ(2) ప్రకారం ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ పోస్టులో వైజయంతి కొనసాగడానికి అర్హత లేదంటూ న్యాయవాది ఎస్‌ఎల్ శ్రీనివాసులు, మరొకరు హైకోర్టులో కోవారంటో పిటిషన్ దాఖ లు చేశారు. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చట్ట విరుద్ధంగా వైజయంతి పదవిలో కొనసాగుతున్నారన్నా రు. బీఎన్‌ఎస్‌లోని నిబంధనల ప్రకారం పదేళ్లకు తక్కువ కాకుండా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలన్నారు. ప్రాసిక్యూషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ల నియామకా నికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమ్మతి అవసరమన్నారు. అయితే ప్రస్తుతం వైజయంతికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రభుత్వంతోపాటు వైజయంతికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు