హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు మూసీనది ప్రక్షాళనపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. మూసీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నిర్మాణల తొలగింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మూసీలో మురుగునీరు కలవకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి కోర్డు ఆదేశించింది. ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని హైకోర్టు తెలిపింది. నిర్వాసితుల గుర్తింపునకు సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహణకు నిర్ణేశం చేసింది. పేదలకు ప్రభుత్వ పరంగా ప్రత్యామ్నాయం చూపాలని హైకోర్టు సూచించింది. హైడ్రాను ఏర్పాటుచేసే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు సూచించింది.