calender_icon.png 31 January, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్వర న్యాయమే లక్ష్యంగా పని చేయాలి

26-01-2025 12:41:02 AM

ఖమ్మంలో హైకోర్టు న్యాయమూర్తులు ఉద్బోధ

ఖమ్మం,(విజయక్రాంతి): కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.శ్రీసుధా, జస్టిస్  భీమపాక నగేశ్, జస్టిస్  కాజా శరత్ పేర్కొన్నారు.  శనివారం ఖమ్మం జిల్లా కోర్టులో నూతనంగా ఏర్పాటు చేసిన రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదులు బెంచ్‌కు సహకరించాలని కోరారు.కక్షిదారులకు సత్వర న్యాయమే పరమావధిగా పని చేయాలని పిలుపునిచ్చారు.  సందర్బంగా వారికి ఖమ్మంలో  ఘనస్వాగతం లభించింది. పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ తదితరులు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేసి,ఘనస్వాగతం పలికారు.స్ధానిక ఎన్‌ఎస్‌పి గెస్ట్‌హౌస్‌లో న్యాయమూర్తులు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.