22-02-2025 10:35:19 PM
వట్టెం వెంకన్న ఆలయ దర్శనం, కోర్టులో పలు కార్యక్రమాల ప్రారంభం
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కే. శరత్(Telangana High Court Judge Sharath) నాగర్ కర్నూల్ జిల్లాలోని వట్టెం వెంకన్న స్వామి ఆలయాన్ని(Vattem Venkanna Swamy Temple) శనివారం దర్శించుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో జూనియర్ జస్టిస్ బోర్డ్ భవన(Junior Justice Board Building) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, జిల్లా కోర్టు ప్రాంగణంలో సోలార్ విద్యుత్తును ప్రారంభించారు. తదనంతరం జిల్లా కోర్టులో మెడికల్ డిస్పెన్సరీ యూనిట్‌ను జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి అధ్యక్షతన ప్రారంభించారు. యశోదా హాస్పిటల్స్, సికింద్రాబాద్ సహకారంతో అడ్వకేట్ అలవేందర్ గౌడ్, డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 12 రకాల సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 400 మంది వినియోగించుకోగా అందులో అడ్వకేట్లు, కోర్టు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవలను పొందారు. గుండె సంబంధిత పరీక్షలు, ఊపిరితిత్తుల పరీక్షలు, షుగర్, బీపీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు.
అనంతరం, జిల్లా కోర్టు ప్రాంగణంలో హైకోర్టు న్యాయమూర్తి కే. శరత్ ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయ సేవలు, న్యాయ ప్రక్రియలు, వివిధ శాఖల విధులు గురించి విస్తృతంగా చర్చించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి. రాజేష్ బాబు, కలెక్టర్ బాదావత్ సంతోష్, బార్ కౌన్సిల్ సభ్యుడు టి. హనుమంత్ రెడ్డి, సీనియర్ సివిల్ జడ్జెస్ సబితా, శ్రీదేవి, జూనియర్ సివిల్ జడ్జెస్ కావ్య, శ్రీనిధి, అడిషనల్ ఎస్పీ సిహెచ్. రామేశ్వర్ ఎక్సైజ్ సూపరిండెంట్ గాయత్రి తదితర జిల్లా పోలీస్ అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖల ప్రతినిధులు, బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.