01-03-2025 10:49:03 PM
అవుట్ పేషెంట్ డిస్పెన్సరీని ప్రారంభించిన హైకోర్టు జడ్జి జస్టిస్ రేణుకా యారా
ఆదిలాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ హైకోర్ట్ జడ్జి జస్టిస్ రేణుకా యారా ఆదిలాబాద్ జిల్లాలో శనివారం పర్యటించారు. స్థానిక పెన్ గంగా గెస్ట్ హౌస్ కు చేరుకున్న హెకోర్ట్ జడ్జికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర రావు, జిల్లా కలెక్టర్ రాజరి షా, జిల్లా ఎస్పి గౌస్ ఆలం తదితరులు పూలమొక్కలు అందించి సాగతం పలికారు. అనంతరం జిల్లా కోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవుట్ పేషెంట్ డిస్పెన్సరీ ని జస్టిస్ రేణుకా యారా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అదేవిధంగా కోర్టు ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.
తదనంతరం బార్ అసోసియేషన్ ఆధర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ రేణుకా యారా మాట్లాడుతూ... న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. అవుట్ పేషెంట్ డిస్పెన్సరీ సదుపాయాన్ని కోర్ట్ ప్రాంగణం లోని న్యాయ సిబ్బంది, కోర్ట్ కి వచ్చే కక్షిదారులు సదినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు శివరాంప్రసాద్, ప్రమీల జెన్, దుర్గారాణి, సౌజన్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, రిమ్స్ డెరెక్టర్ డా. రాథోడ్ జెసింగ్, డిప్యూటీ జిల్లా వెద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన, డాక్టర్ మిట్రపెల్లి శ్రీధర్ , డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు.