calender_icon.png 18 March, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక సంచలన తీర్పు

18-03-2025 12:09:56 PM

హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్..

రూ. కోటి జరిమానా వేసిన జస్టిస్ నగేష్ భీమపాక

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక(High Court Judge Justice Nagesh Bheemapaka) సంచలన తీర్పు వెల్లడించారు. హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్ కు రూ. కోటీ జరిమానా విధించారు. ప్రభుత్వ భూముల కబ్జా ప్రయత్నాలను హైకోర్టు అడ్డుకుంది. పిటిషనర్లు హైకోర్టులో పెండింగ్ విషయం దాచి మరో బెంచ్ వద్దకు వెళ్లారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలా పిటిషన్లు వేయడంపై జస్టిస్ నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్ పెండింగ్ లో ఉండగా మరో బెంచ్ లో ఆర్డర్ తీసుకోవడంపై మండిపడ్డారు. సివిల్ కోర్టులో ఉత్తర్వులు పొందాలన్న కుట్రను హైకోర్టు(Telangana High Court) అడ్డుకుంది. కోర్టును మోసగించాలని చూసిన పిటిషనర్ కు జరిమానా వేసింది. అత్యంత భారీ జరిమానాగా న్యాయవాద వర్గాల్లో చర్చ ప్రారంభమైంది.