కరీంనగర్, జనవరి 5 (విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ మడేకర్ ఉదార నేత్ర వైద్యశాలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్రావు లక్ష రూపాయల విరాళం అందించారు. ఆదివారం ఆసుపత్రిని సందర్శించిన ఆయన ఆసుపత్రి పలు విభాగాలను సంద ర్శించి ఆసుపత్రిలోని పరికరాలు, సౌకర్యాలను చూసి అభినందించారు.
ఆసుపత్రి పనితీరుకు ముగ్ధుడై ఆసుపత్రికి లక్ష రూపాయల విరాళం అందించారు. తెలంగాణ మలేషియా అసోసియే షన్ అధ్యక్షుడు తిరుపతి ఆసుపత్రికి అందించిన 50 వేల రూపాయల విరాళాన్ని నిర్వాహకులకు జడ్జి అందించారు. లయన్స్ క్లబ్ చైర్మన్ కొండా వేణుమూర్తి, కార్యదర్శి ప్రకాశ్ ల్లా, కోల అన్నా రెడ్డి, శరత్ కృష్ణ, మ్యాడం శివకాంత్, బట్టు వినోద్ తోపాటు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
కోల కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్జి...
అలయన్స్ క్లబ్కు చెందిన ప్రముఖ ఇంజనీర్ కోల అన్నారెడ్డి తనయుడు మణిపాల్లో చదువుతున్న కోల ఆదిత్య రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్రావు అన్నారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆదిత్య చిత్రప టానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు.
ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న జడ్జి
బొమ్మకల్ పటేల్ మిత్రసంఘం ప్రతినిధులు నాయిని సంపత్ కుమార్, పురుమల్ల శ్రీనివాస్ ఆహ్వానం మేరకు మిత్ర సంఘం ద్వితీయ సమ్మేళనంలో ఈవీ వేణుగోపాల్రావు ముఖ్య అతిథిగా పాల్గొని సంఘం సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మురళీధర్రావుతోపాటు పటేల్ మిత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.