22-04-2025 01:46:43 AM
హైదరాబాద్, ఏప్రిల్ 21: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌సీఏలో ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ ఇటీవల తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం టీసీఏ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా విచారణ పూర్తయ్యే వరకు హెచ్‌సీఏ ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పరిపాలన విభాగాన్ని ఏర్పాటు చేయకూడదని తెలిపిన హైకోర్టు కేవలం సిబ్బంది జీతాలు, దినసరి ఖర్చులు మినహా ఎలాంటి చెక్కులపై సంతకాలు పెట్టకూడదని స్పష్టతనిచ్చింది.
టీసీఏ తరఫున సీనియర్ లాయర్లు రాజా శ్రీపతి, సురేందర్‌రెడ్డి తమ వాదనలు వినిపించగా.. హెచ్‌సీఏ తరఫున జె.రామచందర్‌రావు కోర్టులో వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోరు..్ట మధ్యంతర ఉత్తర్వులు జారీ అనంతరం కేసు తదుపరి విచారణను జూన్ 16కు వాయిదా వేసింది.