హైదరాబాద్,(విజయక్రాంతి): నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై దాఖలైన పిటిషన్ పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై అడిషన్ల్ అడ్వకేట్ జనరల్(ఏఏజీ) స్పష్టత ఇచ్చారు. విద్యార్థులు బయటి చిరుతిళ్లు తిని అస్వస్థతకు గురయ్యారని, వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని కోర్టుకు తెలిపారు. భోజనం వికటించిన అన్ని పాఠశలల్లో నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపించాలని ధర్మాసనం ఆదేశించింది.
మాగనూరు, కరీంనర్ బురుగు పల్లి ఘటనపై నివేదిక సిద్ధం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అందుకు సంబంధించిన పూర్తి నివేదికను సోమవారం వరకు కోర్టుకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మాగనూర్ హైస్కూల్ లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకముందే మళ్లీ అదే పాఠశాలలో 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది.