calender_icon.png 22 January, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్గొండ రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి

22-01-2025 07:30:24 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): నల్గొండలో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ(Bharatiya Rashtra Samithi Party) నిర్వహించే మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) అనుమతిచ్చింది. జనవరి 28వ తేదీన నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో నిర్వహించే రైతు మహాధర్నాను బీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తుంది. మంగళవారం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లో జరగాల్సిన బీఆర్ఎస్ రైతు మహా ధర్నాను పోలీసులు అనుమతి నిరాకరించడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. తిరస్కరణను సవాలు చేస్తూ బీఆర్ఎస్(BRS) నేతలు హైకోర్టును ఆశ్రయించి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

దీంతో బుధవారం విచారించిన కోర్టు జనవరి 21 నుండి 24 వరకు గ్రామసభలు, ఆ తర్వాత జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరగనున్నందున, బీఆర్ఎస నిరసనకు పోలీసులు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయలేకపోతారని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. దీంతో ఉన్నత న్యాయస్థానం 28న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా కార్యక్రమానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 28న రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు మఖ్యనేతలు, రైతులు పాల్గొననున్నారు.