హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సాంబశివరావునాయుడు పదవీ విరమణ సందర్భంగా బుధవారం తెలంగాణ హైకోర్టు ఘనంగా వీడ్కోలు చెప్పింది. మొదటి కోర్టు హాల్లో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే అధ్యక్షతన న్యాయమూర్తులంతా సమావేశం అయ్యారు. జస్టిస్ సాంబశివరావు నాయుడు అందించిన న్యాయ సేవలను సీజే కొనియాడారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ న్యాయవా దులు, కోర్టు అధికారులు, సిబ్బంది, జస్టిస్ నాయుడి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు బార్ అసోసియేషన్ చైర్మన్ అయ్యపు రవీందర్రెడ్డి అధ్యక్షతన బార్ అసోసియేషన్ కూడా జస్టిస్ సాంబశివరావు నాయుడిని ఘనంగా సత్కరించింది. న్యాయమూర్తి జస్టిస్ శ్యాం కోసి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జస్టిస్ సాంబశివరావు నాయుడు, సూర్యవాణి దంపతులను సత్కరించారు. ఆయన పదవీ విరమణతో హైకో ర్టులో న్యాయమూర్తులు సీజేతో కలిపి 27 మంది ఉన్నారు.