హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాం తి): తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధేను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేసింది. సీజే బదిలీ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాక హైకోర్టులో రెండోస్థానంలో ఉన్న జస్టిస్ సుజయ్ పాల్ తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు.
ముంబై హైకోర్టు సీజేగా ఉన్న దేవేందర్‌కుమార్ ఉపాధ్యాయ ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. ఈ ఇద్దరు సీజేలను బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అధ్యక్షతన కొలీజియం నిర్ణయం తీసుకుంది.