calender_icon.png 20 April, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్‌బోర్డు, పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం

04-04-2025 01:15:27 AM

దివ్య ఖురాన్ స్ఫూర్తిని విస్మరించారని వ్యాఖ్య

చెప్పులు విడిచి ఖురాన్‌ను చదివిన జస్టిస్ నగేశ్

హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): వక్ఫ్‌బోర్డు, పిటిషనర్ల తీరుపై తెలంగాణ హైకోర్టు  ఆగ్రహం వ్యక్తం చేసింది. దివ్య ఖురాన్ స్ఫూర్తిని వక్ఫ్ బోర్డు విస్మరించిందని జస్టిస్ నగేశ్ భీమపాక వ్యాఖ్యానించారు. పిటిషనర్ కూడా ఖురాన్ స్ఫూర్తిని మరిచిపోయారన్నారు. పేదల పక్షాన వక్ఫ్ బోర్డు పనిచేయడం లేదంటూ పవిత్ర ఖురాన్‌లోని పేరాలను చదివారు. జస్టిన్ నగేశ్ తన చెప్పులు విడిచి అందులోని అంశాలను చదివి వినిపించారు. వక్ఫ్‌బో ర్డుపై గతేడాది హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అప్పటి విచారణ సందర్భంగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇబాదత్‌ఖానాను స్వాధీనం చేసుకోవాలని గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై నిర్వహణ కమిటీ వేయాలని ఉన్నత న్యాయస్థానం అప్పట్లోనే ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా వక్ఫ్ బోర్డు నిర్లక్ష్యం వహించింది. దీనిపై పిటిషనర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం వక్ఫ్ బోర్డు తీరుపై మండిపడింది.