యాదాద్రి భువనగిరి, మే 17 (విజయక్రాంతి): దేశంలో రక్తపోటు కారణంగా గుండెపోటు, పక్షవాతంకు గురై ప్రతియేటా 16లక్షల మంది మరణిస్తున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వై. పాపారావు అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రపంచ రక్తపోటు దినోత్స వం సందర్భంగా నిర్వహిం చిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. మరణానికి మొదటి కారణం రక్తపోటు అని, ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేర కు బీపీని కచ్చితంగా కొలవండి, నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి అని కోరా రు.
సాదారణ బీపీ 120/80 ఉండాలని, కాని ప్రస్తుత ఆహార అలవాట్ల కారణంగా బీపీ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. 2025 నాటికి బీపీ రోగుల సంఖ్యను 25 శాతం తగ్గించాలని డబ్ల్యూహెచ్‌వో లక్ష్యమన్నారు. మంచి ఆహార అలవాట్లు, వ్యాయ మం, ఆహ్లాదకర ప్రదేశాల సందర్శనలతో బీపీని నియంత్రించుకోవచ్చన్నారు. బీపీ రోగులను తగ్గించడానికి ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వచ్చి బీపీ పరీక్షలు చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణ, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ యశోద, డాక్టర్ శిల్పి, అధికారులు డాక్టర్ సుమన్‌కల్యాణ్, డాక్టర్ కాటంరాజు, మధుసూదన్, చంద్రశేఖర్, నగేష్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.