calender_icon.png 18 January, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణ బస్తర్‌లో హైఅలర్ట్

18-01-2025 01:32:28 AM

రాయ్‌పూర్, జనవరి 17: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ దండకారణ్యంలో గురువారం మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య చోటు చేసు కున్న ఎదురుకాల్పుల నేపథ్యంలో దండకారణ్యంలో హై అలెర్ట్ కొనసాగుతున్నది. కా ల్పుల సమయంలో ఎంతోమంది మావోయిస్టులు ఘటనా స్థలం అటవీప్రాంతంలోకి పరారయ్యారు. సుమారు 1,500 మంది జవాన్లు శుక్రవారం కూడా కూంబింగ్ కొనసాగించారు. 

మృతదేహాలను గుర్తించే పనిలో పోలీసులు..శుక్రవారానికి మృతుల సంఖ్య 17కు చేరింది. మృతుల్లో ఐదుగురు మహిళా మా వోయిస్టులు ఉన్నారు. మృతదేహాలను పోలీసులు శుక్రవారం ఉసూరు సమీపంలోని న ంబి క్యాంపునకు తరలించారు. మృతుల ఫొ టోలను మీడియాకు విడుదల చేసి, మృతుల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

భారీగా దొరికిన విద్యుత్ తీగలు.. 

ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు జల్లెడ పట్టగా మావోయిస్టుల సొరంగం, విద్యుత్ తీగ లు, భారీ యంత్రం, నూతన టెక్నాలజీని ఉపయోగించేలా ఇంజనీరింగ్ పరికరాలు బ యటపడ్డాయి. తుమ్రైల్ నది మధ్య మావోయిస్టు  డంపును కూడా భద్ర తా దళా లు స్వాధీనం చేసుకున్నాయి.