calender_icon.png 1 October, 2024 | 10:20 AM

హెజ్బొల్లా మళ్లీ నిలబడుతుంది

01-10-2024 12:38:07 AM

  1. ఇజ్రాయెల్ భూదాడులను తిప్పికొడతాం
  2. హెజ్బొల్లా డిప్యూటీ లీడర్ నయీం ఖాసీం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ నస్ర ల్లా మరణం తర్వాత.. ఆ ఉగ్రసంస్థ తాత్కాలిక చీఫ్, డిప్యూటీ లీడర్ షేక్ నయూమ్ ఖాసీం తొలిసారిగా సోమవారం మాట్లాడారు. ‘నస్రల్లా సహా హెజ్బొల్లా అగ్రనేతల హత్యలకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం.

ఇజ్రాయెల్ లెబనాన్ భూభాగంపై దాడులు చేయా లని అనుకుంటోందని.. ఇదే జరిగితే తాము కూడా ప్రతిదాడులకు సిద్ధంగా ఉన్నామని ఖాసీం స్పష్టం చేశారు. అమాయకులైన ప్రజలపై బాంబులు వేసి విజయం సాధించాలని ఇజ్రాయెల్ అనుకుంటే అది భ్రమ మాత్రమే అవుతుంది. తప్పకుండా ఇజ్రాయెల్‌తో సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.

గాజాకు మద్దతివ్వడం, లెబనాన్‌ను రక్షించడం అనే ప్రధాన లక్ష్యాలను కొనసాగిస్తాం అని ఖాసీం స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతున్న అమెరికాకు కూడా ఖాసీం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇజ్రాయెల్‌కు అమెరికా పెద్ద ఎత్తున సైనిక, ఆర్థిక సహాయాన్ని అందించిందని, ఇలా చేయడం ద్వారా లెబనాన్, గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధ నేరాల్లో అమెరికా కూడా పాలుపంచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనికి అమెరికా కూడా భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించకతప్పదని స్పష్టం చేశాడు. హెజ్బొల్లా కొత్త చీఫ్‌ను ఎన్నుకునేవరకు తాత్కాలిక చీఫ్‌గా ఖాసీం కొనసాగనున్నాడు.

ఒక్కరోజే 105 మంది మృతి..

హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గత 24 గంటల్లో 105మంది చనిపోగా 350 మందికిపైగా గాయపడ్డారని లెబ నాన్ అధికారులు తెలిపారు. గత 15 రోజులుగా ఐడీఎఫ్ జరుపుతున్న దాడుల్లో దాదాపు 1000 మంది వరకు చనిపోయినట్లు సమాచారం. హెజ్బొల్లాతోపాటు హౌతీ ఉగ్రవాదు లపై ఇజ్రాయెల్ దాడులో చేస్తోంది. 

ఇటీవల లెబనాన్‌లో దాగిఉన్న హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను ఐడీఎఫ్ బలగాలు మట్టుపెట్టిన విష యం తెలిసిందే. నస్రల్లా దాగి ఉన్న స్థావరాన్ని గుర్తుంచిన ఐడీఎఫ్ బలగాలు కొన్ని నిమిషాల వ్యవధిలో 80కి పైగా బాంబుదాడులు చేసి అతడిని మట్టుబెట్టాయి.

ఇప్పటివరకు ఇజ్రాయెల్.. 20మందికి పైగా హెజ్బొల్లా అగ్రనేతల ను హతమార్చింది. వారిలో సస్రల్లా, నబిల్ కౌక్‌తో పాటు ఇతర నేతలు ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. సామాన్యులు నష్టోపోకుండా దాడిని కొనసాగించాలని ఐడీఎఫ్ సైన్యాన్ని ఆదేశించారు.

బీరుట్‌పై మొదటి దాడి

ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా దాడులు సాగిస్తున్న ఇజ్రాయెల్  మరింత దూకుడు పెంచింది. సోమవారం తెల్లవారుజామున లెబనాన్ రాజధాని బీరుల్‌లోని నివాస ప్రాంతాలపై వరుసగా వైమానిక దాడులతో విరుచుకుపడింది. కోలా ప్రాంతం లోని ఓ అపార్ట్‌మెంట్ భవనం పై అంతస్తుపై ఇజ్రాయెల్ బలగాలు బాంబులు ప్రయోగించాయి.

ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా చాలామంది గాయపడ్డారు. ఇప్పటివరకు హెజ్బొల్లా స్థావరాలే టార్గెట్‌గా దాడులు చేసిన ఇజ్రాయెల్.. ఇప్పుడు నివాస సముదాయాలపైనా విరుచుకుపడటంతో ప్రజ లు భయాందోళనకు గురవుతున్నారు.

హెజ్బొల్లా ఉగ్రవాదులు నివాస సముదాయాల్లో తమ ఆయుధాలు, క్షిపణుల ను దాచిపెట్టారిని, వాటిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా తాము దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెట్ ఐడీఎఫ్ ప్రకటించింది. పౌరులు ఆయుధాలు దాచిపెట్టి ఉన్న ఇళ్లను ఖాళీచేసి వెళ్లిపోవాలని ఐడీఎఫ్ హెచ్చరించింది.

కాగా తాజాగా కోలా జిల్లాలో ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో ఫీఎఫ్‌ఎల్‌ఎఫ్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్‌కు చెందిన ముగ్గురు ముఖ్య నాయకులు మరణించారని రాయిటర్స్ వార్తాసంస్థ నివేదించింది.