calender_icon.png 23 January, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెజ్బొల్లా అగ్రనేత షేక్ హమాదీ కాల్చివేత

23-01-2025 12:40:03 AM

బీరుట్, జనవరి 22: సీనియర్ హెజ్బొలా నాయకుడు షేక్ ముహమ్మద్ అలీ హమాదీని తూర్పు లెబనాన్‌లోని బెకా జిల్లాలోని మచ్‌ఘరాలోని అతడి ఇంట్లోనే కాల్చి చంపారు. హమాదీని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా కొద్ది సేపటికే మృతిచెందాడు.

కుటుంబ కలహాలతోనే ఈ హత్య జరిగి ఉం టుందని లెబనాన్ అధికారులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పం దం ముగియడానికి కొన్ని రోజుల ముందే ఈ ఘటన జరిగింది. ఏథెన్స్ నుంచి రోమ్‌కు 153 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేసిన నిందితుల్లో హమాదీ ఒకడు.